News

రథయాత్రలో అప‌శ్రుతి… ముగ్గురు మృతి

497views

ధ‌ర్మ‌పురి: తమిళనాడు ధర్మపురి జిల్లాలో అపశ్రుతి జరిగింది. మతేహల్లి గ్రామంలోని కాళిక దేవి జాతర సందర్భంగా.. భక్తులు రథం లాగుతుండగా.. భక్తులపైనే రథం బోల్తాపడింది. రథం చక్రాలు విరిగిపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు భక్తులు రథం కింద చిక్కుకోగా.. ముగ్గురు భక్తులు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. రథం లాగుతుండగా ఇలాంటి విషాదం జరగడం వల్ల భక్తులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి