
514views
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోవత్సవాన్ని ఈ నెల 21న దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్ లో జరిగే ప్రధాన ఉత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ యోగా సాధన చేయనున్నారు. 75 మంది కేంద్ర మంత్రులు ముఖ్యమైన 75 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలలో యోగా చేస్తారు.
దేశవ్యాప్తంగా జరుపుకొంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు గుర్తుగా.. 75 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలలో యోగా కార్యక్రమాలలో పాల్గొనడానికి 75 మంది మంత్రులను నామినేట్ చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా.. మహారాష్ట్ర లోని నాసిక్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ త్రయంబకేశ్వర్ ఆలయ సముదాయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా యోగా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Source: Nijamtoday





