
426views
న్యూఢిల్లీ: మావోయిస్టు పార్టీ నేతలపై ఎన్ఐఏ రివార్డులను ప్రకటించింది. నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్పై రూ.50 లక్షలు రివార్డ్‌ను ప్రకటించింది. అలాగే 2013లో ఛత్తీస్గఢ్ జీరంఘట్టి దాడిలో ప్రమేయమున్న.. 21 మందిపై రూ.1.25 కోట్లకు పైగా రివార్డులను ప్రకటించింది. కమాండర్ హిడ్మాపై రూ.25 లక్షల రివార్డును ప్రకటించింది. మావోయిస్ట్ అగ్రనేత గణపతిపై రూ.కోటి రివార్డ్‌ను ప్రకటించింది. బస్వరాజ్, కటకం సుదర్శన్, మల్లోజుల వేణుగోపాలరావుపై.. రూ.కోటి చొప్పున రివార్డులను ఎన్ఐఏ ప్రకటించింది. కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి, పాక హన్మంతు అలియాస్ ఊకే గణేష్పై ఒక్కొక్కరిపై రూ.7 లక్షల చొప్పున రివార్డ్‌ను ఎన్ఐఏ ప్రకటించింది.





