News

మార్చి 8 నుండి గ్వాలియర్లో ర్రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి సభ

726views

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి సభ, ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరగనున్నది. ఈ సమావేశంలో వర్తమాన జాతీయ, రాజకీయ,సామాజిక మరియు ధార్మిక దృష్టికోణాల పై చర్చించి కీలకమైన నిర్ణయాలను ప్రకటించ నున్నారు. గ్వాలియర్ లోని శివపురి లింక్ రోడ్డు లో ఉన్న కేదార్ ధామ్ లో మార్చ్ 8వ తేదీ నుండి మార్చ్ 10వ తేది వరకు 3 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుం డి షుమారు  1400 మందికి పైగా ప్రతినిధులు, ప్రముఖ కార్యకర్తలు ఈ సమావేశానికి వస్తున్నారు.

ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ గారు పాత్రికేయులకు  ఈ సమావేశ వివరాలను  తెలియజేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలను సంఘటితం చేసే ఉద్దేశ్యంతో 11 కార్య క్షేత్రాలు, 43 ప్రాంతాల యొక్క కార్యకారిణి సభ్యు లతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సంఘ ప్రతినిధులు,విభాగ్ ప్రచారకులు,అలాగే వివిధ క్షేత్రాలలో పనిచేస్తూ భావ సారూప్యత కలిగిన వివిధ సంస్థల కేంద్ర ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.

పూజ్యనీయ సర్ సంఘ్ చాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ గారి మార్గదర్శనం లో, సర్ కార్యవాహ శ్రీ భయ్యా జీ జోషీ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో,రానున్న సంఘ శిక్షా వర్గలలో జరగాల్సిన శిక్షణా కార్యక్రమాలను రూపొందించడం, అలాగే రానున్న సంవత్సరంలో జరగవలసిన కార్యక్రమ వివరాలను కేంద్ర అధికారులంతా చర్చించి నిర్ణయించడం జరుగుతుంది.

సంఘ్ కార్యక్రమాల గురించిన సర్వోన్నత నిర్ణయాలు తీసుకునే ఈ ప్రత్యేక సమావేశం ప్రతిసంవత్సరం ఇలాగే నిర్వహించబడుతుంది. గత సంవత్సరం జరిగిన కార్యక్రమాల పరిశీలన, సమీక్ష, అలాగే రాబోయే సంవత్సరంలో జరగవలసిన కార్యక్రమాల వివరాలు, ఆచరణాత్మక వ్యవహారాలపై పూర్తి స్థాయిలో చర్చించబడుతుంది. ప్రస్తుత సమావేశాన్ని శ్రీ మోహన్ జీ భాగవత్ గారు,శ్రీ భయ్యా జీ జోషిగారు మార్చ్ 8న ఉదయం 8.30ని. లకు ప్రారంభిస్తారు

దేశంలో ఉగ్రవాదుల అరాచకాలు,సైన్యం ద్వారా నిర్వహించ బడిన ఎయిర్ స్త్రైక్ , రామమందిర విశేషాలు,రానున్న లోక్ సభ ఎన్నికలు వీటిపై అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ శ్రీ అరుణ్ కుమార్, ప్రస్తుత సమావేశాలలో ఈ విషయాలన్నీ చర్చించి,విస్తృతమైన ప్రకటనను సర్ కార్యవాహ చేస్తారని తెలియజేశారు..

ఇంకా ఈ సమావేశంలో శ్రీ అరుణ్ కుమార్ గారితో పాటు, ఆర్ ఎస్ ఎస్ అఖిల భారత సహ ప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర జీ ఠాకూర్ మరియు మధ్య ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర జీ జైన్ కూడా పాల్గొన్నారు