News

సైఫాబాద్‌లో నాణేల మ్యూజియం

472views

సైఫాబాద్‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణలోని సైఫాబాద్‌ టంకశాలలో మ్యూజియం ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌పీఎంసీఐఎల్‌) సంకల్పించింది. ఈ మేరకు ఏడు నెలల క్రితం పనులు మొదలుపెట్టారు. 1901 నాటి ఈ భవనం శిథిలావస్థకు చేరుకోగా పునరుద్ధరించడంతోపాటు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మంగళవారం ఎస్‌పీఎంసీఐఎల్‌ సంస్థ ఛైర్మన్‌, ఎండీ త్రిప్తిఘోష్‌ దీన్ని ప్రారంభించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి