News

అయోధ్య రామయ్యకు ధర్మవరం జరీ వస్త్రం

612views

అయోధ్య: అయోధ్య రామమందిరంలో కొలువుదీరనున్న సీతారాముల కోసం రూపొందించిన రామకోటి జరీవస్త్ర ప్రదర్శనకు భక్తులనుంచి విశేష స్పందన లభించింది. ధర్మవరానికి చెందిన నేత కళాకారుడు నాగరాజు 180 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు గల పట్టవస్త్రంపై 13 జాతీయ భాషల్లో 32,200 జైశ్రీరామ్‌ నామాలు, 316 శ్రీమద్‌ రామాయణ ఘట్టాలతో వస్త్రాన్ని నేశారు. ఈ వస్త్రాన్ని మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో భక్తుల సందర్శనార్థం ప్రదర్శించారు.

దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ రామాంజనేయులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జరీవస్త్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొదటి రోడ్డు, సమీప ప్రాంతాల భక్తులు ఆలయానికి చేరుకుని, రామకోటి జరీ వస్త్రాన్ని సందర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవదాయశాఖ ఇనస్పెక్టర్‌ లక్ష్మీనారాయణ, ఆలయ ఈఓ విజయ్‌ కుమార్‌, అనువంశీకుడు హోసూరు రామసుబ్రహ్మణ్యం, జయప్రకాష్‌ యాదవ్‌, అర్చకబృందం, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి