
491views
-
తప్పు తెలుసుకొని దోచుకెళ్ళిన నగలను మళ్ళీ ఆలయం వద్ద ఉంచిన వైనం
మైసూరు: అమ్మవారి తాళిబొట్టును చోరీ చేసుకుని వెళ్ళిన దొంగలు తప్పు తెలుసుకుని తిరిగి ఆలయానికి వచ్చి కొంత నగదు, అమ్మవారి నగలు అక్కడ పెట్టి వెళ్ళిన వైనం మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని ఉప్పినహళ్ళి గ్రామంలో చోటు చేసుకుంది. గతనెల 24న గ్రామంలోని దుర్గాంబ ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు అమ్మవారి తాళిబొట్టును ఎత్తుకెళ్ళారు. అంతలోనే తప్పు తెలుసుకుని దొంగలు భక్తుల తరహాలో గుడికి వచ్చి దొంగిలించిన నగ, కొంత నగదు కానుకగా పెట్టి వెళ్ళిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.





