News

పోస్టుమార్టం కోసం లంచం అడిగిన డాక్టర్ సందాని బాషా

536views

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఆకలితో అలమటిస్తున్న ఓ కూలీకి కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. బ‌తుకు పోరాటంలో ఊరు కానీ ఊరు వచ్చారు.

కొన్ని రోజులుగా తాము పనిచేస్తున్న యజమాని.. సరిగా డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు ఓ వ్యక్తి. రెండు రోజులుగా ఎంతో మనోవేదన చెందాడు. అప్పులతో పూట గడవడం కష్టంగా మారింది. అంతా కష్టాల్లోనూ యజమాని డబ్బులు ఇవ్వలేదు. ఇవన్నీ ఆలోచించి భార్యకు కూడా ఏమి చెప్పకుండా తోటలోకి వెళ్ళి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

భర్తను కోల్పోయి పట్టెడు దుఖంలో ఉన్న ఆ మహిళకు డాక్టర్ సందాని బాషా రూపంలో మరో కష్టం ఎదురైంది. భర్త మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళ‌గా.. శవపంచనామాకు లంచం అడిగాడు డాక్ట‌ర్‌ సందాని బాషా.

చేతిలో చిల్లి గవ్వలేదని ఆమె వాపోయింది. ఎలాగైన తమ భర్తకు శవపంచనామా నిర్వహించమని కాళ్ళ‌వెళ్ళ‌ పడి ప్రాధేయపడింది. అయినా కనికరించేలేదు ఆ వైద్యుడు. పోస్టుమార్టం చేయాలంటే రూ.16వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫోన్​ పే చేయమని చెప్పి నెంబర్ ఇచ్చి వైద్య వృత్తికే కలంకం తెచ్చాడు. అన్ని విధాలుగా ప్రాధేయపడి.. విసిగిపోయిన ఆ మహిళ.. చివరకు వైద్యుడు సందాని బాషాపై ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి