News

లౌడ్ స్పీకర్లు లేకుండా షిర్డీలో మొదటిసారి కాగడా హారతి

563views
  • ఆగ్రహించిన స్థానిక జామా మసీద్ ముస్లిం పెద్దలు

షిర్డీ: షిర్డీ సాయిబాబాకు కాగడా హారతి విషయంలో అనేక ఏళ్ళ‌ తర్వాత కీలక మార్పులు వచ్చాయి. లౌడ్​స్పీకర్లు లేకుండానే వేకువజామున హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అధికారులు. బుధవారం ఉదయం నుంచే ఈ విధానం అమలు చేస్తున్నారు. సాయి బాబాకు రోజులో నాలుగు సార్లు అర్చకులు హారతి ఇస్తారు.

ఉదయం 5.15 గంటలకు కాగడా హారతి ప్రారంభం అవుతుంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు అనేక మంది భక్తులు వేకువజామునుంచే ఆలయంలో ఎదురుచూస్తారు. అయితే.. బుధవారం మాత్రం కాస్త భిన్నంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. “పోలీసుల నుంచి మాకు ఓ లేఖ అందింది. లౌడ్​స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వారు ప్రస్తావించారు. వాటిని అనుసరించి ఆలయంలో అన్ని పూజా కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి” అని వివరించారు షిర్డీ సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి భాగ్యశ్రీ బనాయత్.

షిర్డీ పోలీస్​ స్టేషన్​ ఇన్​స్పెక్టర్ గులాబ్​రావ్​ పాటిల్​ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే.. ఆ సమయంలో అజాన్ కోసం కూడా లౌడ్​స్పీకర్లను వినియోగించలేదని స్పష్టం చేశారు. లౌడ్​స్పీకర్లు వాడాల్సిందే…లౌడ్​స్పీకర్లు లేకుండా కాగడా హారతి నిర్వహించడంపై షిర్డీలోని జమా మసీద్ ట్రస్ట్, స్థానిక ఇస్లాం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక ఏళ్ళుగా ఉన్న పద్ధతిని అలానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. బాబా ఆలయం.. షిర్డీకి అంతర్జాతీయంగా ఖ్యాతిని తెచ్చిందని, మతసామరస్యానికి ప్రతీకని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి