News

శంషాబాద్ ఎయిర్పోర్టులో డ్రోన్ కలకలం

526views

* 4 గంటలపాటు ఎగిరిన డ్రోన్

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు గగనతలంలో డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. మామిడిపల్లి వైపు నుంచి పైకి లేచిన డ్రోన్.. ఎయిర్పోర్టు సమీపంలో నాలుగు గంటలు ఎగిరింది. ల్యాండింగ్కు వచ్చే విమానాలకు ఏటీసీ నుంచి సిగ్నల్స్ రాకపోతే ఇదే ప్రాంతంలో తక్కువ ఎత్తులో తిరుగుతుంటాయి. అయితే అక్కడ డ్రోన్ చక్కర్లు కొట్టడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. సైబరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.