News

అనుమానంతో పిల్లల ముందే భార్యను పొడిచి చంపిన ఉన్మాది జహీర్ పాషా

446views

బెంగ‌ళూరు: కర్ణాటకకు చెందిన జహీర్ పాషా అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తరచుగా పోర్న్ చూసేవాడు. రెండు నెలల క్రితం ఓ నీలి చిత్రం చూసిన అతడు.. అందులో కనిపించింది తన భార్యేనని అనుమానించాడు. అప్పటి నుంచి ఆమెతో ప్రతిరోజూ గొడవ పడ్డాడు. ఇదే క్రమంలో ఆమెను హత్య చేశాడు. తమ పిల్లల ముందే కత్తితో పొడిచి చంపేశాడు.

బెంగళూరులో నివాసం ఉంటున్న వీరికి.. 15ఏళ్ల క్రితం వివాహమైంది. ఐదుగురు పిల్లలు ఉన్నారు. అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ తన భార్యపై ఎప్పుడూ ఆరోపణలు చేసేవాడు. రెండు నెలల క్రితం చూసిన పోర్న్ చిత్రంలోని మహిళ.. తన భార్యలాగే ఉండటం వల్ల ఈ దారుణానికి తెగబడ్డాడు. వీడియో చూసిన వెంటనే.. తన భార్యను ఓ కుటుంబ ఫంక్షన్​లోనే తీవ్రంగా కొట్టాడు పాషా. 20రోజుల క్రితం కూడా ఆమెపై చెయ్యి చేసుకున్నాడు.

తీవ్రంగా గాయపడ్డ మహిళ.. ఆస్పత్రిలో చేరిందని పోలీసులు తెలిపారు. మహిళ తండ్రి గౌస్ పాషా తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు. నాలుగు రోజుల క్రితమే దంపతులు రామనగర్​కు తమ మకాం మార్చారని.. అంతలోనే నిందితుడు హత్య చేశాడని పోలీసులు వివరించారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన పాషా కుమారుడు భయంతో.. వెంటనే తన తాతయ్య ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళాడని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి