News

శ్రీవారి దర్శనం సిఫార్సు లేఖలు ఫోర్జరీ… పోలీసుల అదుపులో నిందితుడు

448views

తిరుప‌తి: శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం కోసం ఫోర్జరీ సిఫారసు లేఖ ఇచ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తెలంగాణకు చెందిన యాదయ్య శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి సిఫారసు లేఖను తీసుకుని తిరుమల అదనపు ఈవో కార్యాలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనం కోసం ఈనెల 17న దరఖాస్తు చేశాడు. లేఖను పరిశీలించిన కార్యాలయ సిబ్బంది నకిలీదిగా గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి