308
గాంధీనగర్: సంప్రదాయ ప్రాచీన వైద్యానికి సంబంధించి నూతన శకం ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులో భాగంగా జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఘెబ్రియేసస్, మారిషస్ ప్రధాని ప్రవింద్‌కుమార్ జగన్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ అంతర్జాతీయ కేంద్రంతో సంప్రదాయ వైద్యంలో ఓ నూతన శకం ప్రారంభం కానుందని అన్నారు. రానున్న 25 ఏళ్లలో ఈ కేంద్రం ప్రపంచ మానవాళికి దగ్గర కానుందని.. వారి జీవితాల్లో కీలక భాగం కానుందని పేర్కొన్నారు.