
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేషనల్ అసెంబ్లీ సమావేశం కాగానే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ సభ్యులు హంగామా సృష్టించారు. షెహబాజ్ ఎన్నిక సమయానికి సభనుంచి వాకౌట్ చేశారు. తాను దొంగల సభలో కూర్చోలేనని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. జాతీయ అసెంబ్లీకి రాజీనామా కూడా ప్రకటించారు. పీటీఐ సభ్యులంతా రాజీనామాలు చేస్తారని ఇమ్రాన్ తెలిపారు.
ఇలా ఉండగా, పాకిస్థాన్‌లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని, పీఎంఎల్-ఎన్ సుప్రీం నవాజ్ షరీఫ్ తిరిగి స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పాక్ విడిచిపెట్టి కొద్దికాలంగా లండన్‌లో ఉంటున్న ఆయన ఈద్ పండుగ తర్వాత వచ్చే నెలలో పాక్ వస్తారని పీఎంఎల్-ఎన్ సీనియర్ నేత మియాన్ జావెద్ లతీఫ్ తెలిపారు.
పీఎంఎల్-ఎన్ భాగస్వామ్య పక్షాలతో కూడా నవాబ్ రాకపై చర్చిస్తున్నామని చెప్పారు. పనామా పేపర్ల కేసులో 2017 జూలైలో సుప్రీంకోర్టు నవజ్‌ను పదవి నుంచి తొలగించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై పలు అవినీతి కేసులు పెట్టింది.
Source: Nijamtoday





