News

స్వదేశీ పరిజ్ఞానంతో ఎలక్ట్రిక్ ట్రక్కులు

464views
  • వాహన రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ అడుగులు

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికాకు చెందిన కంపెనీతో జత‌కట్టిన గుజరాత్‌ సంస్థ ట్రిటాన్.. దేశంలోనే మొట్టమొదటి ఈ-ట్రక్కును గుజరాత్‌లో తయారు చేయనుంది. ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు హిమాన్షు పటేల్ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను తెలిపారు.

ఈ ట్రక్కు 100% మేడ్ ఇన్ ఇండియా అని హిమాన్షు పటేల్ వివరించారు. దీనికి సంబంధించిన అన్ని విడిభాగాలను దేశీయంగానే తయారు చేయనున్నట్టు వివరించారు. ఇందుకోసం బ్యాటరీలు, సర్క్యూట్‌లు, సెమీకండక్టర్‌లు, కాంపోనెంట్‌లతో సహా 9 కంపెనీల విడిభాగాల తయారీ సంస్థలతో జతకట్టినట్టు వెల్ల‌డించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి