News

దుష్టశక్తుల పేరిట మౌల్వీ దుష్టబుద్ధి!

627views
  • యువ‌తిపై అత్యాచార య‌త్నం

పెన్నాడం(త‌మిళ‌నాడు): త‌మిళనాడులో దుష్టశక్తులను పారద్రోలాలనే సాకుతో ఓ మౌల్వీ యువతిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి అగరుబత్తీల రూపంలో మ‌త్తు పదార్థాన్ని ఉపయోగించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడు.

కడలూరులోని పెన్నాడం సమీపంలో 22 ఏళ్ళ‌ వివాహిత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందినా ఆమె కోలుకోలేదంటున్నారు. అయితే, ఆమెకు దుష్టశక్తులు ఉన్నాయని ఇరుగు పొరుగువారు, బంధువులు భర్తను నమ్మించి పెన్నాడంలోని దర్గాకు తీసుకెళ్ళాలని సూచించారు.

వారి సలహా మేరకు ఆమెను తన మామ, బంధువుతో కలిసి దర్గాకు తీసుకెళ్ళాడు. దర్గాలోని 54 ఏళ్ల మౌల్వీ అబ్దుల్ ఘనీ వారి చేతులకు దారం కట్టి, దుష్టశక్తులను తరిమికొట్టడానికి గది నుండి బయటకు వెళ్ళ‌మని కోరాడు. గ‌దిలో ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో బాధితురాలి భర్త గదిలోని కిటికీలోంచి చూశాడు.

అబ్దుల్ ఘనీ తన భార్య నాసికా రంధ్రాల దగ్గర కొంత ధూపాన్ని ఉంచడం చూసి షాక్ అయ్యాడు. ఆమె వెంటనే మూర్చ‌పోయింది. ఘనీ తన ఒడిలో తల పెట్టుకుని అపస్మారక స్థితిలో ఉన్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి భర్త వెంటనే గదిలోకి ప్రవేశించి ఆమెను రక్షించాడు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అబ్దుల్ ఘనీపై ఫిర్యాదు చేశాడు. అట్రాసిటీ చట్టంపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Source: Hindu Post

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి