News

బెంగాల్‌లో మ‌ళ్ళీ హింస… రాష్ట్రపతి పాలన కోరిన బీజేపీ!

608views

కోల్‌క‌తా: బెంగాల్‌, బీర్భూమ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఎనిమిది మందిని చంపడాన్ని “భయంకరమైన అనాగరికం”గా అభివర్ణిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని గవర్నర్ జగదేవ్ ధన్‌కర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవంక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) డిమాండ్ చేసింది. ఈ సంఘటనపై వెంటనే నివేదిక పంపమని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

బీర్భూమ్‌లోని రామ్‌పూర్‌హట్ ప్రాంతంలో సోమవారం ఆ ప్రాంతంలో ఒక టీఎంసీ నాయకుడిని హత్య చేసినందుకు ప్రతీకారంగా ఒక గుంపు వారి ఇళ్ళ‌కు నిప్పుపెట్టడంతో ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనపై గవర్నర్ ట్విటర్‌లో వీడియో ప్రకటనను పంచుకున్నారు.

ఈ సంఘటనతో తాను “బాధపడ్డాను, కలవరపడ్డాను” అని ఆయన తెలిపారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని గవర్నర్ స్పష్టం చేశారు. పక్షపాత ప్రయోజనాలకు మించి పరిపాలన ఎదగడం లేదని గవర్నర్ మమతా బెనర్జీ పాలనపై విరుచుకుపడ్డారు.

  • గవర్నర్‌ను కలిసిన బీజేపీ

బీర్‌భూమ్‌లో ఇద్దరు చిన్నారులు సహా 10 మందిని సజీవ దహనం చేసిన దారుణ ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించింది. మరోవంక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనపై విచారణకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గన్వ్యాంత్ సింగ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి