News

UPI సర్వీసులు అందించనున్న టాటా గ్రూప్

509views

గదు రహిత లావాదేవీలలో భాగంగా వచ్చిన యూపీఐ సర్వీసులు మన జీవితంలో ఒక భాగంగా మారిపోయిన సంగతి మనకు తెలిసిందే. టీ షాపులు, కూరగాయల షాపులు, పండ్ల దుకాణాలు ఇది, అది అని తేడా లేకుండా అన్నింటిలోకి నగదు రహిత లావాదేవీలు వచ్చేశాయి. దాంతో లక్షల రూపాయల నుంచి 1,2 రూపాయల వరకూ కూడా లావాదేవీలన్నీ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ఎక్కడికైనా సరే క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరమే లేకపోతోంది.

ఇప్పటికే యూపీఐ సర్వీసులను అందిస్తున్న భీం యాప్, గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, వాట్సాప్ పే, పేటీఎంలకు పోటీగా UPI పేమెంట్స్ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చేందుకు టాటా గ్రూప్ కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు తీసుకున్నట్లు టాటా గ్రూప్ డిజిటల్ కామర్స్ యూనిట్ తెలిపింది. కార్యకలాపాలను నిర్వహించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ తో చర్చలు జరుపుతున్నట్లు ఆ సంస్థ అధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.