News

పన్ను ఎగవేతదారులపై కేంద్రం కొరడా

520views

* దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఐటీ సోదాలు

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయపు పన్ను ఎగవేత ఆరోపణలపై ‘ది యూనివర్సల్ ఎడ్యుకేషన్ గ్రూప్’ (యూఈజీ) సంస్థ యజమాని జీసస్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసింది. ముంబయిలోని 12 ప్రాంతాలతో పాటు, ఠాణె, వసాయ్, నాశిక్, మిరా భయిందర్, ఔరంగబాద్ లలో తనిఖీలు చేపట్టింది. తమిళనాడులోని తిరుచినాపళ్లి, బెంగళూరులోని రెండు ప్రాంతాల్లోనూ రైడ్లు నిర్వహించింది.

మరోవైపు, అక్రమాస్తుల కేసుల్లో భాగంగా 18 మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లల్లో కర్ణాటక ఏసీబీ సోదాలు నిర్వహించింది. మొత్తం 75 ప్రదేశాల్లో సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఏసీబీకి చెందిన 100 మంది అధికారులు, 300 మంది సిబ్బంది సోదాల్లో భాగమయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.