News

మే 6న ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఓటీటీ స్ట్రీమింగ్

677views

విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న “ది కశ్మీర్ ఫైల్స్” మూవీ ఓటీటీ రైట్స్ ను జీ5 సొంతం చేసుకుంది. మార్చి 11న విడుదలైన ఈ చలనచిత్రం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 30 ఏళ్ళ క్రితం జమ్మూ కాశ్మీర్లో హిందువులపై జరిగిన దారుణ మారణ కాండను ఈ సినిమాలో దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి హృద్యంగా తెరకెక్కించారు. చిత్రం థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని భావించారు. అయితే సినిమాకు వచ్చిన క్రేజ్ దృష్ట్యా మరికొంతకాలం థియేటర్లలోనే ఉంచి, మే 6న ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.