236
శ్రీనగర్లో ముగ్గురు ముష్కరులను భారత సైన్యం హతమార్చింది. వీరిని లష్కరే తోయిబాకు చెందినవారిగా గుర్తించారు. ఖాన్మోహ్ లో కొద్దిరోజుల క్రితం సర్పంచ్ ను చంపింది వీరేనని పోలీసులు ధృవీకరించారు.
నౌగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో మిలిటెంట్లు కాల్పులు జరిపారు. తిప్పికొట్టిన బలగాలు వారిని మట్టుబెట్టాయి. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యమయ్యాయి.