
597views
బరేలీ: అజహర్ అలియాస్ ఔరంగజేబ్ అనే కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఓ విద్యార్థిని వేధించాడు. సంఘటన తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు అతన్ని కొట్టి, పోలీస్ స్టేషన్కు లాగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో ప్రత్యక్షమైంది.
నిందితుడు అజహర్ అలియాస్ ఔరంగజేబ్ ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా ఫరీద్పూర్ పట్టణంలో కోచింగ్ సెంటర్ నడుపుతున్నాడు. అక్కడ తన విద్యార్థినులలో ఒకరిని వేధించాడని అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఈ దారుణ ఘటన గురించి తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు కోచింగ్ సెంటర్కు చేరుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళారు. కాగా, బరేలీలోని ఫరీద్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు అని పోలీసులు అధికారులు ట్వీట్ చేశారు.
Source: OpIndia





