
430views
-
మాది ముస్లిం దేశమైనా తీవ్రవాదాన్ని సహించమని వెల్లడి
రియాద్: సౌదీ అరేబియాలో శనివారం ఒక్క రోజే 81 మందికి మరణశిక్ష అమలు చేశామని స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. ఏడాది పొడవున అమలు చేసిన మరణశిక్షల కంటే ఈ ఒక్క రోజు అమలు చేసిన మరణశిక్షల సంఖ్యే ఎక్కువ. టెర్రరిజం సహా ‘అత్యంత క్రూరమైన నేరాలు’ చేసిన ఏడుగురు యెమన్ జాతీయులు, ఒక సిరియా జాతీయుడు కూడా వీరిలో ఉన్నారని ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ ఎస్‌పీఏ వెల్లడించింది.
వీరిలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐఎస్) ఆల్‌ఖైదా, యెమన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఉన్నారని తెలిపింది. అయితే, చాలామంది విషయంలో విచారణ న్యాయబద్ధంగా జరగలేదని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.





