News

సరిహద్దుల్లో డ్రోన్ కలకలం… అప్రమత్తమైన అధికారులు

411views

* పాకిస్తాన్ పనేనని భద్రత దళాల అనుమానం…..

భారత సరిహద్దు ప్రాంతాల్లో శనివారం డ్రోన్లు కలకలం సృష్టించాయి. రాజస్థాన్​లోని శ్రీగంగానగర్​ జిల్లా బిజనోర్​ గ్రామంలో డ్రోన్లను గుర్తించిన అధికారులు అప్రమత్తమై కాల్పులు జరిపారు. డ్రోన్​ను కూల్చేందుకు సుమారు 18 రౌండ్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేపడుతున్నామని.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్​లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. జమ్మూ జిల్లాలోని అర్నియా ప్రాంతంలో డ్రోన్లు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇది పాకిస్థాన్​ చర్యగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ ద్వారా నిందితులు డ్రగ్స్​, బాంబులు వంటివి ఆ ప్రాంతానికి చేరవేశారా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా గాలిస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.