
449views
బెంగళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. షిమోగా జిల్లాలో ఒక యువకుడిని గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. ఈ హత్య తర్వాత షిమోగా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుడు బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష్ అల్డో(24)గా పోలీసులు గుర్తించారు. హర్ష్ తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పోస్ట్ చేశాడనే నెపంతో ఈ హత్య జరిగినట్టు బజరంగ్ దళ్ నేతలు ఆరోపిస్తున్నారు. శివమొగ్గ నగరంలోని భారతి కాలనీలో రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది.

Source: Tv9





