ArticlesNews

పాలకులారా బాధ్యతగా మెలగండి

770views

యిదారేళ్ల క్రితం అనుకుంటాను…. తెదేపా ప్రభుత్వ హయాంలో… నెల్లూరు ఎస్పీ గారు ముస్లిం నాయకులను పిలిచి తీవ్రవాద సంస్థలకు, తీవ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉండమని, వారి పిల్లలను సైతం అలాంటి కార్యకలాపాలకు దూరంగా పెంచమని కొన్ని మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేశారు. అంతే…. వాళ్ల మనోభావాలు దెబ్బతిని పోయాయి. తెల్లారేపాటికల్లా పెద్ద ఎత్తున గుమికూడి పోలీస్ స్టేషన్ పై రాళ్ల దాడికి తెగబడ్డారు. స్టేషన్ లోకి జొరబడడానికి, పోలీసులపై దాడికి యత్నించారు. పోలీసులు కొంత చాకచక్యంగా వ్యవహరించడంతో అంతటితో సద్దుమణిగి వెనుతిరిగారు. మరి మనవి సెక్యులర్ ప్రభుత్వాలు కదా? వెను వెంటనే ఆ ఎస్పీ గారు బదిలీ అయిపోయారు. సాక్షాత్తూ పోలీస్ స్టేషన్ పైనే దాడికి తెగబడ్డ వారిపై ఎలాంటి కేసులూ లేవు. వారు స్వేచ్ఛగా రొమ్ము విరుచుకుని సంచరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పోలీసుల స్థైర్యాన్ని దెబ్బతియ్యవా? ఇలాంటి పరిస్థితులలో పోలీసులు స్వేచ్ఛగా పనిచెయ్యగలరా?

ఆ మధ్య గుంటూరులోనూ అదే పరిస్థితి ఎదురైంది. వేల సంఖ్యలో ముస్లిములు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. నిందితులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక వారిపై బేషరతుగా కేసులు ఎత్తేశారు. స్టేషనుపై దాడి చేసినవారికి ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతులివ్వనందుకు ఆనందించాల్సిన పరిస్థితి మిగిలినవారిది. అలా ఉంది మన ప్రభుత్వాల తీరు.

ఆ మధ్య కర్ణాటకలోని బెంగుళూరులో…. ఎవరో ఏదో ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారని అర్ధరాత్రి వేలాది మంది ఆ ఇంటి పైకి రాళ్ల దాడి చేశారు. ఆ వీధిలో ఉన్న మొత్తం వాహనాలను తగులబెట్టారు. అదే అదనుగా ఆ వీధి లోని అన్నెం పుణ్యం ఎరుగని మిగతావారి ఇళ్లపై కూడా దాడి చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. స్థానిక ప్రజలను భయ భ్రాంతులను చేశారు. అక్కడ మాత్రం కొందరిపై కేసులు పెట్టి అరెస్టు చేసినట్టున్నారు.

మొన్నీమధ్యనే కర్నూలు జిల్లా ఆత్మకూరులో హిందువుల నివాస ప్రాంతాల మధ్య ఎలాంటి అనుమతులూ లేకుండా ఓ మసీదు నిర్మించాలని ప్రయత్నించారు. స్థానికులు సహజంగానే అదేమిటని ప్రశ్నించారు. పరిస్థితిని తెలుసుకోవడానికి, అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి స్థానిక బిజెపి నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే అక్కడ వేల సంఖ్యలో (ఎక్కడినుంచి వస్తారో తెలీదు. ఏ ఘటనలో అయినా ఇదే తంతు) గుమికూడి వున్న ముస్లిములు పెద్ద ఎత్తున ఆయనపైకి దాడికి యత్నించారు. ఆత్మరక్షణ కోసం ఆయన కారులోకెక్కి కూర్చుని అక్కడినుంచి తప్పించుకునే యత్నం చేశారు. అయినా సరే విడువకుండా ఆయన కారును వెంబడించారు. కారు పైన నిర్విరామంగా రాళ్లు విసురుతూనే ఉన్నారు. కొందరు మూర్ఖంగా కారుకు అడ్డు నిలుచున్నారు. వేగంగా తప్పించుకుపోయే ప్రయత్నంలో ఒక వ్యక్తికి కారు తగిలి మృతి చెందాడు. ఇంతలో శ్రీకాంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లో దూరి తలదాచుకున్నాడు. వ్యక్తి మృతితో ఆగ్రహోదగ్రులైన ముస్లిములు పోలీస్ స్టేషన్ పై రాళ్ల దాడి చేశారు. పోలీస్ స్టేషన్ లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. వాహనాలను తగులబెట్టారు. అక్కడే ఉన్న శ్రీకాంత్ రెడ్డి వాహనాన్ని సైతం పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి కి, ఆయన అనుచరులకు, పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపారు. నిజానిజాలను తెలుసుకున్నారు. ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి జరిగిన ఘటనలో కేరళ కేంద్రంగా పనిచేసే ముస్లిం మతవాద సంస్థ SDPI హస్తం ఉన్నదని, స్థానికులను వారే రెచ్చగొట్టారని, ఆత్మకూరు తదితర ప్రాంతాలలో స్థానిక ముస్లిం యువకులకు SDPI శిక్షణ కూడా ఇచ్చిందని, ఆ శిక్షణా తరగతులు జరుగుతున్న తరుణంలో వివరాలు తెలుసుకోవడానికి వెళ్లిన పోలీసులను SDPI కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. అయితే ఇందులో కొసమెరుపేమిటంటే ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టిన రెండు రోజుల వ్యవధిలో అదే మతవాద SDPI నాయకులకు రాష్ట్ర హోం మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం. వారికి అభయ హస్తాన్ని ఇవ్వడం. సాక్షాత్తూ హోంమంత్రే మతతత్వ సంస్థలకు దన్నుగా నిలిస్తే పోలీసులు స్వేచ్ఛగా తమ కర్తవ్యాన్ని నిర్వహించగలరా?

అలాగే నిన్నగాక మొన్న కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ రగడ నేపథ్యంలో కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలలో కొన్నిచోట్ల ముస్లిములు హిజాబ్ కు అనుకూలంగా పెద్ద సంఖ్యలో ర్యాలీలు తీశారు. పోలీసుల సమక్షంలోనే వారు ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేసినట్లుగా కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే అందులో నిజానిజాలను ఇంకా అధికారికంగా ఎవరూ నిర్ధారించలేదు.

ఏ రాష్ట్రంలోనైనా, సమస్య ఏదైనా దశాబ్దాలుగా నిరసనలు జరిగిన, జరుగుతున్న తీరు ఒక్కటే. అన్నిచోట్లా రాళ్ల దాడులు సర్వ సహజం. జరిగిన, జరుగుతున్న ఘటనలన్నిటినీ పరిశీలిస్తే…. అన్నిటిలోనూ ఒకటే క్రమం కనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ముస్లిములు పెద్ద సంఖ్యలో గుమికూడటం, పెద్దపెట్టున నినాదాలు చేయడం, అప్పుడప్పుడూ వాటిలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు కూడా ఉంటాయి. రాళ్ల దాడులు చేయడం. ఘటనతో సంబంధం ఉన్న వారి, లేని వారి ఆస్తులను ధ్వంసం చేయడం…. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఇదే తంతు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగానూ వారు నిరసనలు వ్యక్తం చేసే తీరిదే. దీని వెనుక వ్యూహం ఉండదంటారా? ముందస్తు తయారీ ఉండదంటారా? లేకపోతే భాష, ప్రాంతం, దేశాలతో సంబంధం లేకుండా ఎక్కడ చూసినా ఒకే పద్ధతి ఎలా పునరావృతమవుతుంది?

నిజానికి ఈ దాడుల వెనుక వారు చెప్పే కారణాలు కూడా నిజం కాదు. వీటి వెనుక స్థానిక ప్రజలను, ముఖ్యంగా అన్య మతస్తులను, ప్రభుత్వాలను, పాలనా యంత్రాంగాన్ని భయభ్రాంతులను చేసి తమ ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఇస్లాం యొక్క దురాక్రమణ మనస్తత్వం ఉన్నది. పోలీసులకు, ప్రభుత్వాలకు ఈ విషయం తెలియనిదేమీ కాదు. కానీ రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్న పరిస్థితి. అధికార పక్ష ప్రయోజనాలకు అనుగుణంగా పని చేయాల్సిన దుస్థితి అధికార యంత్రాంగానిది.

ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగంతోపాటుగా బాధిత వర్గాలు సైతం ఇకనైనా కళ్లు తెరవాలి. తమ పాలనలోని ప్రజలందరి ప్రయోజనాల రక్షణకై తాము నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా పని చెయ్యడానికే ఉన్నామన్న సంగతిని గుర్తెరిగి ఉండాలి. స్వాతంత్ర్యం రాక పూర్వం నుంచి దేశంలోని రాజకీయ పక్షాలు అనుసరిస్తున్న ఈ దివాళాకోరు సంతుష్టీకరణ విధానం వల్లనే ఇప్పుడు పరిస్థితి ఇంత దాకా వచ్చింది.

నిజానికి ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిములకు ఒక స్పష్టమైన విధానం ఉంది. మొదట సంఖ్యాపరంగా బలపడటం. ఆ సంఖ్యను ఆధారం చేసుకుని తమ మత ప్రయోజనాలకై, వ్యాప్తికై, ఆధిపత్యానికై ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడం. పరమతాల వారిపై అవకాశం దొరికినప్పుడల్లా దాడులు చేయడం. వారిని భయభ్రాంతులను చెయ్యడం. తద్వారా అన్ని రంగాలలో, అన్ని విధాలా తమ ఆధిపత్యాన్ని చెలాయించడం. ప్రపంచవ్యాప్తంగానూ, దేశంలోనూ జరిగిన, జరుగుతున్న ఘటనలను పరిశీలించినవారికెవరికైనా ఈ విషయం తప్పక అవగతమవుతుంది. ముస్లింల యొక్క ఇలాంటి పోకడ ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా ప్రమాదకరమే. ఈ పోకడను ఇలాగే కొనసాగనిస్తే ఇది భవిష్యత్తులో దేశం యొక్క మనుగడకే సవాలు విసురుతుంది. వారి ఆ తరహా విభజనవాద ధోరణి కారణంగానే ఇప్పటికే దేశం ఒకసారి ముక్కలైంది. ఇలాంటి పరిస్థితులే కొనసాగితే దేశం మళ్ళీ మళ్ళీ ముక్కలు కాక తప్పదు. అందుకే పాలకులారా తస్మాత్ జాగ్రత్త. మీ బాధ్యతను మీరు మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకతీతంగా సక్రమంగా నిర్వర్తించండి చాలు. అన్నీ సర్దుకుంటాయ్.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.