
882views
అయోధ్యలో రామ మందిరం ఎప్పుడు నిర్మిస్తారా అని ప్రతి హిందువు ఎదురుచూస్తూ ఉన్నారు. ఒకప్పుడు పాలకులు.. ఆ తర్వాత నాయకులు రామ మందిరాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు. రామ జన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలను అర్పించారు. హిందువుల కల నెరవేరలేదు.
ఈ అంశం గురించి ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా స్పందించారు. రామ మందిరం నిర్మాణాన్ని అయోధ్యలో కాకుండా, మక్కా, మదీనాలోనో లేకపోతే వాటికన్ సిటీలోనో నిర్మించ లేరుగా అని సూటిగా ప్రశ్నించారు. రాముడు మన పూర్వీకుడని, కేవలం, హిందువులకే కాదు ముస్లింలకు కూడా ఆయన పూర్వీకుడని వ్యాఖ్యానించారు. రాముడి జన్మస్థలం అయోధ్య అనేది వాస్తవమని, ఇక్కడ రామమందిర నిర్మాణం జాతికి గర్వకారణమని అభిప్రాయపడ్డారు. రామమందిర నిర్మాణం అంశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టొద్దని రాం దేవ్ బాబా అన్నారు. గుజరాత్, ఖేదా జిల్లాలోని నదియాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Source : Bharath Today.
https://www.bhaarattoday.com/news/national/story/30702.html





