News

చలికి తట్టుకోలేక నలుగురు భారతీయులు మృతి

374views

న్యూఢిల్లీ: అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఓ పసికందు సహా మొత్తం నలుగురు భారతీయులు చలికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా, కెనడాల్లోని భారత రాయబారులతో మాట్లాడారు. ఘటనపై అత్యవసరంగా స్పందించాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధం ఉన్న ఓ వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్ట్​ చేశారు.

చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో సరిహద్దులను దాటేందుకు ప్రయత్నిచంగా వీరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ఓ పసికందు సహా ఇద్దరు మైనర్లు ఉన్నట్టు మనిటోబా రాయల్​ కెనడియన్​ మౌంటెడ్​ పోలీసులు తెలిపారు. ఎమెర్సన్​కు సమీపంలో అమెరికా- కెనడా సరిహద్దులో కెనడా వైపున నలుగురి మృతదేహాలకు గడ్డకట్టుకుపోయిన లభించినట్టు చెప్పారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి