
-
అర్ధరాత్రి హిందూ దుకాణంపై దాడి
-
మళ్ళీ కోరలు సాచిన మతోన్మాదులు
ఢాకా: గత ఏడాది దుర్గాపూజ సందర్భంగా బంగ్లాదేశ్‌లో జరిగిన హిందూ వ్యతిరేక హత్యాకాండల గాయం నుంచి హిందువులు ఇంకా కోలుకోకముందే అదే దేశంలో మరో దుర్ఘటన సంభవించింది. ఒక్క రాత్రిలో 35 సరస్వతీ మూర్తులను మతోన్మాదులు ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో హిందువులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు.
ఓడరేవు నగరం చిట్టగాంగ్‌లో వచ్చే నెల అయిదోతేదీన జరగబోయే సరస్వతీ పూజ కోసం బోల్‌ఖాలీ(చిట్టగాంగ్ జిల్లాలోని ఉపజిల్లా)లో గొప్ప నైపుణ్యంతో సరస్వతీ విగ్రహాలను శిల్పి బసుదేవ్ పాల్ తయారు చేశారు. అయితే, వీటిపై కన్నేసిన మతోన్మాదులు ఈ నెల 14, శుక్రవారం రాత్రి కనీసం 35 సరస్వతీ విగ్రహాలను ధ్వంసం చేశారు. దుకాణంపై దాడి చేసి, అద్దాలు పగులగొట్టి, విగ్రహాలను ధ్వంసం చేశారని బెంగాలీ దినపత్రిక సాంగ్‌బాద్ ప్రతిదిన్ పేర్కొంది. ఉపజిల్లాలోని తూర్పు షక్‌పురాలోని సుప్రసిద్ధ లాలా హాట్ ఆశ్రయన్ ప్రాజెక్ట్ సమీపంలో సంఘటన స్థలం ఉన్నది.
సరస్వతీ విగ్రహాలు తయారు చేసి, విక్రయించడం బాసుదేవ్ వృత్తి. అతని పూర్వీకులు కూడా హిందూ దేవతల శిల్పాలు తయారు చేసి, ఉపాధి పొందేవారు. వారి నుంచి దేవ్‌కు ఈ వృతి సంక్రమించింది. వందేళ్ళ నుంచి ఉపాధి కల్పిస్తోంది. నిజానికి దేవ్ పేద కళాకారుడు. ప్రస్తుతం వీరి కుటుంబానికి ఇదే ఆధారం. ఈ దాడితో స్థానికులూ ఉలిక్కిపడ్డారు. ఆగ్రహించిన వారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ధ్వంసమైన వాటిలో చాలా వరకు వివిధ క్లయింట్లు ఆర్డర్ చేయబడ్డవే. ఇంతకుముందెన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదని శిల్పి దేవ్ రోదించారు.
చిట్టగాంగ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(నార్త్) మహ్మద్ కబీర్ అహ్మద్, పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి మహ్మద్ అబ్దుల్ కరీం, బోల్‌ఖలి పూజో సెలబ్రేషన్ పరిషత్ మెంబర్ సెక్రటరీ అమిత్ లాలా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Source: Hindupost





