News

శబరిమలలో ఉద్యోగుల ఇష్టారాజ్యం!

618views
  • యథేచ్ఛగా హుండీ సొమ్ము చోరీ

  • ఘటనలను పట్టించుకోని సర్కారు

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోని ఉద్యోగులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. హుండీ సొమ్ము యథేచ్ఛగా చోరీ చేస్తున్నారు. ఈ చర్యలను పలుమార్లు నిజాయితీగల హిందూ ఉద్యోగులు అడ్డుకుంటున్నా ఏదో రకంగా ఆలయ సొమ్ము దొంగలపాలవుతోంది. తాజాగా, ఓ టెల్లర్‌ హుండీ సొమ్ము దొంగిలిస్తూ దొరికిపోయాడు. ఈ సీజన్‌లో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన రెండో వ్యక్తి ఇతను.

ఈ నెల ఎనిమిదో తేదీన హుండీ లెక్కింపులో నిమగ్నమైన గుమస్తా రూ.3,500 దొంగిలించాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఇదిలావుండగా, గతంలో కూడా ఇటువంటి చోరీలు చోటుచేసుకున్నాయి. డిసెంబర్‌ 16, 2021న, కరెన్సీ లెక్కింపులో నిమగ్నమై ఉన్న శంకరనారాయణ పనికర్‌ అనే ఉద్యోగి కూడా శబరిమల హుండీ నుండి డబ్బును దొంగిలించినట్టు అధికారులు గుర్తించారు. అతని గదిలో సోదాలు చేయగా ఒక సంచిలో రూ.42,470లు లభ్యమయ్యాయి. ఈ సొమ్ము రికవరీ చేసి, కేసు పెట్టారు.

మరో సంఘటన

ధనలక్ష్మి బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయడానికి సిద్ధం చేసిన నోట్లలో సైజు వ్యత్యాసాన్ని గమనించారు నిజాయితీ గల హిందూ ఉద్యోగులు. సైజు వ్యత్యాసానికి కారణం.. ట్రెజరీ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులే… అయితే, నెయ్యి వల్ల నోట్లు జిడ్డుగా మారాయని… దీంతో లెక్కింపు యంత్రం తప్పుగా చూపించిందని ఉన్నతాధికారులు ఈ అవినీతిని పట్టించుకోలేదు.

శబరిమల సన్నిధానంలో డబ్బు, ఇతర ప్రసాదాల చోరీ జరగకుండా ఉండేందుకు ‘నిరంతర నిఘా’ నిర్వహించాలని అప్పట్లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇంకా… ఇలాంటి దొంగతనాల గురించి శబరిమల ప్రత్యేక కమిషనర్‌కు తెలియజేయాలని టీడీబీ(ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు)ని కోర్టు ఆదేశించింది.

కాగా, దొంగతనాలను నియంత్రించేందుకు బాడీ స్కానర్లు, ఎక్స్‌-రే యూనిట్లు వంటి అధునాతన చెకింగ్‌ గాడ్జెట్‌లను ఇన్‌స్టాల్‌ చేయాలని ఉద్యోగులు పదే పదే ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అయితే, సాంకేతికత, ఖర్చును ప్రస్తావిస్తూ సర్కారు ఆలస్యం చేస్తోందని హిందూ ఉద్యోగులు ఆరోపించారు.

ఇప్పుడు మనం చూస్తున్నది నామ మాత్రమేనని, ఆలయ స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచిన 40 కిలోల బంగారం, 100 కిలోల వెండి మాయమైనట్టు 2019లో గుర్తించారని స్థానిక భక్తులు తెలిపారు. అయితే, అవినీతి నిరోధక శాఖ అధికారులు, వారి కమ్యూనిస్ట్‌ మాస్టర్లచే ‘ఆడిట్‌’ నిర్వహించారని, ఈ ఆడిట్‌ అనంతరం ఎటువంటి వ్యత్యాసాలు లేవని తేల్చిపారేశారని భక్తులు ఆవేదన చేశారు. ఆలయంలో చోరీకి పాల్పడిన ఎక్కువ మంది కమ్యూనిస్టు పార్టీ యూనియన్‌ నాయకులతో అనుబంధం ఉన్నవారేనని భక్తులు ఆరోపిస్తున్నారు.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి