
-
బైబిల్ బోధించిందని పిచ్చి పని..
-
హుండీల్లో వాడిన కండోమ్‌లు వేసిన మతోన్మాది
మంగళూరు: కర్నాటకలో 62 ఏళ్ళ క్రైస్తవ వ్యక్తి.. చెత్త కుండీల్లోంచి సేకరించిన వాడిన కండోమ్‌లను అనేక హిందూ దేవాలయాలను, గురుద్వారాలలో పడవేసి, అపవిత్రం చేశాడు. జాన్ దేశాయ్ కుమారుడు దేవదాస్ దేశాయ్(62) అనే నీతిలేని మనిషి ఈ పనిచేసినందుకు మంగళూరు సౌత్ పోలీసులు అరెస్టు చేశారు. వీడి కోసం పోలీసులు ఏడాది పాటు శ్రమపడాల్సి వచ్చింది.
ఆయా ఆలయాల ప్రాంగణంలో వాడిన కండోమ్‌లు కనిపించడంతో మంగళూరు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నెల 27న కొరజ్జన కట్టె గ్రామంలోని దేవాలయంలో విరాళాల పెట్టెలో ఉపయోగించిన కండోమ్ కనిపించడం, వారి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సిసిటివి ఫుటేజీని పరిశీలించగా, ఆ వ్యక్తి హుండీల్లో ఏదో వదిలివేయడం, స్థలం నుండి వెళ్లిపోవడం కనిపించింది. ఈ ఆధారాలతో చివరకు నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో అతను ఇదే విధంగా అనేక దేవాలయాలను అపవిత్రం చేసినట్టు అంగీకరించాడు.
Listen to Devadas S/o John Desai, a 62yrs old honest & sincere individual who is following his book.
He desecrated 18+ temples, gurdwaras by putting used condoms.
1/n pic.twitter.com/bWxPjNV61f
— भारत पुनरुत्थान Bharata Punarutthana (@punarutthana) December 30, 2021
మంగళూరులోని మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి… సీసీటీవీ ఫుటేజీ సాయంతో మా బృందం నిందితుడిని పట్టుకోగలిగిందని మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. నిందితుడు గత 20 ఏళ్లుగా మంగళూరులో నివాసముంటున్న హుబ్బలిలోని ఉంకల్‌కు చెందిన దేవదాస్ దేశాయ్‌గా గుర్తించినట్టు తెలిపారు.
“తన తండ్రి నుండి, కుటుంబం క్రైస్తవ మతాన్ని ఆచరిస్తోంది. కొన్నాళ్ల క్రితం భార్య, బిడ్డను విడిచిపెట్టి వారితో టచ్‌లో లేడు. అతను తీవ్రమైన క్రైస్తవుడు” అని కమిషనర్ శశికుమార్ తెలిపారు. ప్రజలు తన మతాన్ని అనుసరించేలా దేశాయ్ ఇతర మతాల మత స్థలాలను అపవిత్రం చేశారని పోలీసులు తెలిపారు.
నిందితుడు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ వయోభారంతో ఉద్యోగం మానేసి ప్లాస్టిక్‌ను సేకరించి పాత డీలర్లకు విక్రయించి జీవనోపాధి పొందుతున్నాడు. మొత్తం 18 స్థలాలను అపవిత్రం చేసినట్టు నిందితుడు వెల్లడించాడు. దేశాయ్ హిందూ మతపరమైన ప్రదేశాలను కాకుండా గురుద్వారాలు, మసీదులతో సహా ఇతర పవిత్ర స్థలాలను కూడా అపవిత్రం చేశాడని పోలీసులు తెలిపారు.
కండోమ్‌లతో పాటు, భక్తుల మతపరమైన భావాలను దెబ్బతీసేలా లేఖలు, రాజకీయ నాయకుల వికృత చిత్రాలను కూడా ఆయా హుండీల్లో దేశాయ్ పడేశాడు.
మీడియాతో మాట్లాడిన నిందితుడు, జీసస్ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తాను ఇలా చేస్తున్నానని తన చర్యను సమర్థించుకున్నాడు. “నేను గత 15 ఏళ్ళుగా యేసు సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నాను. యేసు తప్ప వేరే దేవుడు లేడని బైబిల్ చెబుతోంది. అపవిత్రమైన ప్రదేశాలకు అశుద్ధ బహుమతులు ఇవ్వాలి కాబట్టి నేను ఈ కండోమ్‌లను వదిలివేసాను. నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు, దేవుడు మాకు 70 ఏళ్ల జీవితాన్ని ఇచ్చాడు.. నాకు ఇప్పటికే 62 ఏళ్లు ఉన్నాయి, ”అని దేశాయ్ చెప్పుకున్నాడు.
Source: Opindia





