
22views
జమ్మూకాశ్మీర్ పై సార్వభౌమాధికారం
భారత దేశానిదేనని పునరుద్ఘాటిస్తూ బ్రిటన్ పార్లమెం టులో ఒక సభ్యుడు తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్ లో జమ్మూకశ్మీర్ విలీనమైన అక్టోబరు 26ను పురస్కరించుకుని ఈ తీర్మానాన్ని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్ మ్యాన్ గత వారం బ్రిటన్ ప్రతినిధుల సభముందుకు తీసుకొచ్చారు. వేర్వేరు పార్టీలకు చెందిన మరో ముగ్గురు సభ్యులు దీనిపై సంతకాలు చేశారు. ‘కశ్మీరీ మూలాలున్న బ్రిటన్ పౌరులు అక్టోబరు 26ను భారత్ లో జమ్మూకశ్మీర్ విలీన దినోత్సవంగా పాటిస్తున్న విషయాన్ని ఈ సభ పరిగణనలోకి తీసుకుంటుంద’ని తీర్మానం పేర్కొంది. విలీన పత్రంపై 1947 అక్టోబరు 26న మహరాజా హరిసింగ్ సంతకం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ సహా జమ్మూకశ్మీ ర్లో ఉగ్రవాద చర్యల కారణంగా పౌరులు మృతి చెందడంపై తీర్మానం విచారం వ్యక్తం చేసింది.





