
596views
-
అయినా క్రిస్మస్ చేసుకోవచ్చు అంటున్న అక్కడి ప్రధాని
లండన్: బ్రిటన్‌లో బుధవారం ఒక్కరోజే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల్లో దేశంలో 6, 43, 219 కేసులు వెలుగుచూసినట్టు యూకే హెల్త్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రపంచదేశాల్లోనూ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోంది. యూకేలో 1,06,122 కేసులు నమోదవగా… 140 మంది మృతిచెందారు. అయితే.. కొవిడ్ సమయంలో ఆరోగ్య సిబ్బంది పనితీరును ప్రశంసిస్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిస్టమస్ నేపథ్యంలో సిబ్బంది బూస్టర్ డోసు పంపిణీపై దృష్టి పెట్టిందని అన్నారు. అయితే.. కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ క్రిస్టమస్ సంబరాలు జరుపుకోవొచ్చని జాన్సన్ చెప్పడం గమనార్హం.





