
699views
2016 లొ కమ్యునిస్టుల కోట JNU డిల్లీ లొ కమ్యునిస్టు విధ్యార్ధి నాయకుడు కణ్హయ్య కుమార్ తో సహా మరి కొందరు నిత్య విద్యార్ధులు దేశవ్యతిరేక నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులొ అరెస్టయిన కణ్హయ్య కుమర్ & కొ తరువాత బెయిల్ ఫై రిలీజవడంతో డిల్లీ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ కేసును చాలెంజి గా తీసుకున్నారు. ఇందుకోసం తొమ్మిది మంది అధికారులతొ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఇక అండర్ కవర్ ఆపరేషన్ ను ప్రారంభించిన ఈ బృందం, రకరకాల మారు వేషాలలొ JNU వద్ద వీరి కదలికలను పసిగట్టారు. ఎవరెవరు వీరిని కలుస్తున్నారో తెలుసుకున్నారు. ఇందులొ భాగంగా 13 సార్లు కాశ్మీర్ వెళ్ళి ఎవరికీ అనుమానం రాకుండా ఇన్వెస్టిగేషన్ చేశారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు పట్టువదలని విక్రమార్కులవలె శోధించారు. ఫైనల్ గా కణ్హయ్య కుమార్ కు జాతివ్యతిరేక శక్తులతో నేరుగా సంబంధాలున్న తిరుగులేని సాక్ష్యాధారాలు సంపాదించారు. ఆధారాలు లభించడంతో కణ్హయ్య కుమార్ తో పాటు మరొ తొమ్మిది మందిపై దేశద్రొహ కేసులు నమోదు చేశారు. కాగా ఈ కేసులొ కణ్హయ్య కుమార్ కు దాదాపు ఏడేళ్ళు జైలు శిక్ష పడనుంది.





