News

దివ్యాంగుల సేవకై సక్షం కార్యకర్తలకు శిక్షణా తరగతులు

729views

తే 20/1/2019ది న నెల్లూరులో సక్షం ప్రాంత ప్రశిక్షణ వర్గ జరిగింది. ఈ వర్గలో కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల కార్యకర్తలు 60 మంది పాల్గొన్నారు. ఈ వర్గలో దివ్యాంగులకు సేవ చేయడం, వివిధ వైద్య పరమైన అంశాలలో వారికి సహాయ సహకారాలు అందించడం, వివిధ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం తదితర అంశాలపై శిక్షణనిచ్చారు. పిల్లలకు బాల్యదశలో వైకల్యం రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ఏదయినా చిన్నపాటి సమస్యలున్నా వాటి చికిత్స, సమస్య పెద్దది కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, మానసిక వైకల్యం వున్న చిన్నారుల పట్ల తీసుకోవలసిన శ్రద్ధ, ఇవ్వవలసిన శిక్షణ, వైద్య సహకారం, దేశ వ్యాప్తంగా సక్షం చేపడుతున్న కార్యక్రమాలు తదితర విషయాలను డా|| సురేష్ వివరించారు.

ఈ వర్గలో సక్షం అఖిల భారత ఉపాధ్యక్షులు శ్రీ లక్కరాజు కాశీనాథ్, ప్రాంత కార్యదర్శి శ్రీ A.V.S మూర్తి, సహకార్యదర్శి శ్రీ విప్పర్ల రామారావు, నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ సురేష్ పాల్గొన్నారు. స్థానిక కార్యకర్తలు శ్రీ కిరణ్ కుమార్, శ్రీ దోర్నాదుల వెంకటేశ్వర్లు, శ్రీ రమేష్ తదితరులు వర్గ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఇంకా ఈ వర్గలో ఆరెస్సెస్ విభాగ్ సంఘచాలక్ మాననీయ హరికుమార్ రెడ్డి, సహ సంఘచాలక్ మాననీయ రామదండు, విభాగ్ సేవా ప్రముఖ్ శ్రీ చంద్ర శేఖర్ పాల్గొన్నారు.