
401views
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లేందుకు ప్రపంచంలోనే అతి ఎత్తైన విమాన మార్గాన్ని ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎంచుకుంది. ఇకపై ఆ దేశాలకు వెళ్లే విమానాలు హిందూకుష్ పై నుంచి ప్రయాణించనున్నాయి. ఇలా చేయడం కారణంగా సమయంతో పాటు ఇంధనాన్ని కూడా ఆదా చేయవచ్చని సంస్థ భావిస్తుంది. అప్గాన్ గగనతలం మూసివేతతో భారత విమానాలు హిందూకుష్ మార్గం ద్వారానే ప్రయాణిస్తున్నాయి.
ప్రపంచంలోని ఎత్తైన విమాన మార్గాలలో హిందూకుష్ ఒకటి, ఈ మార్గం ద్వారా నడిపితే సమయంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. ఇటీవల టొరంటో నుంచి దిల్లీకి వెళ్లే విమానం హిందూ కుష్ మార్గంలోనే ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గత వారం టొరంటో మార్గంలో నలుగురు పైలట్‌లను అందుబాటులో ఉంచింది.





