
షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ అంతటా కనెక్టివిటీని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధిని పెంచే లక్ష్యంతో, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ట్విటర్‌లో ప్రధాని మాట్లాడుతూ, “ఇది ఉత్తరప్రదేశ్ అంతటా కనెక్టివిటీని మెరుగుపరిచే ముఖ్యమైన ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్. ఇది ఆర్థికాభివృద్ధి, పర్యాటకాన్ని కూడా పెంచుతుంది” అని ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం సమాచారం ప్రకారం… ఎక్స్‌ప్రెస్‌వే వెనుక ఉన్న ప్రేరణ, దేశవ్యాప్తంగా వేగవంతమైన కనెక్టివిటీని అందించాలనేది ప్రధాన మంత్రి లక్ష్యమన్నారు.
594 కిలోమీటర్ల పొడవైన ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్‌వేను రూ.36,200 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్నారు. మీరట్‌లోని బిజౌలి గ్రామం దగ్గర ప్రారంభమయ్యే ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాగ్‌రాజ్‌లోని జుడాపూర్ దండు గ్రామం వరకు విస్తరించనున్నారు. ఇది మీరట్, హాపూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభాల్, బుదౌన్, షాజహాన్‌పూర్, హర్దోయ్, ఉన్నావ్, రాయ్ బరేలీ, ప్రతాప్‌గఢ్ , ప్రయాగ్‌రాజ్ మీదుగా వెళుతుంది.
పని పూర్తయిన తర్వాత, ఇది ఉత్తరప్రదేశ్‌లో అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే అవుతుంది, ఇది రాష్ట్రంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాలను కలుపుతుంది. షాజహాన్‌పూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వేపై అత్యవసర టేకాఫ్ , ఎయిర్ ఫోర్స్ విమానాల ల్యాండింగ్‌కు సహాయం చేయడానికి 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్ స్ట్రిప్ కూడా నిర్మించనున్నారు. ఎక్స్‌ప్రెస్‌వే వెంట పారిశ్రామిక కారిడార్‌ను కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే 2024 నాటికి పూర్తవుతుంది.
Source: Organiser





