News

ముజమ్మిల్​ హుసైన్​… దొంగ పెళ్ళికొడుకు!

540views
  • రూ. 10 ల‌క్ష‌ల క‌ట్నం డిమాండ్‌

  • అంత‌లోనే తెలిసిపోయిన అస‌లు సంగతి

  • నిత్య‌పెళ్ళికొడుకుని పీట‌ల‌పైనే బాదేసిన వ‌ధువు బంధువులు

ల‌క్నో: ముజమ్మిల్​ హుసైన్​… దొంగ పెళ్ళికొడుకు! పైగా… అక్ష‌రాల ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల క‌ట్నంను డిమాండ్ చేశారు. దీంతో వ‌ధువు బంధువులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. ఆ షాక్‌నుంచి తేరుకొనేలోపే అస‌లు బండారం బ‌య‌ట‌ప‌డింది. వ‌రుడు ఒక దొంగ పెళ్ళికొడుక‌ని! ఇంత‌కుముందే ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకున్నాడ‌ని! ఇంకేముంది… మాంచి కాక‌మీద ఉన్న వ‌ధువు త‌రుఫు వాళ్ళు.. పెళ్ళి లేదు గిళ్ళి లేదు.. క‌ట్నం లేదు… కానుక‌లు లేవ‌ని ఆ పీట‌ల‌పైనే వ‌రుడిని ఒక ప‌ట్టు ప‌ట్టారు. గేప్ లేకుండా చిత‌క‌బాదేశారు… ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్ అయింది.

ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాకు చెందిన నిందితుడు ముజమ్మిల్​ హుసైన్​కు దిల్లీకి చెందిన యువతితో పెళ్ళి నిశ్చయమైంది. గాజియాబాద్​​ జిల్లా మోహన్​నగర్​లో శుక్రవారం వివాహ వేడుకలను నిర్వహించారు. మరికాసేపట్లో పెళ్ళి అనగా రూ.10 లక్షల కట్నం అడిగారు హుసైన్​ తరఫు వారు. అదే సమయంలో వధువు కుటుంబీకులకు హుసైన్​కు ఇదివరకే వివాహం జరిగిందన్న విషయం తెలిసింది. దీంతో ఆగ్రహం చెందిన వధువు తరపు వారు పెళ్ళికొడుకుపై దాడికి దిగారు.

సమాచారం అందుకుని పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హుసైన్​ పెళ్ళి వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన అతడి తండ్రిపై కూడా కేసు నమోదు చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి