News

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియా కేంద్రం

522views
  • నేడు ప్రారంభించనున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్​లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేడు ప్రారంభించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్​ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ కేంద్రాలు లేనందున హైదరాబాద్​లో ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జూన్ 14న సీజే ప్రతిపాదించారు. కేసీఆర్ వెంటనే అంగీకరించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు.

నగరంలోని నానక్​రాంగూడలోని ఫీనిక్స్ వీకే టవర్​లో 25 వేల చదరపు అడుగులతో ఐఏఎంసీని సిద్ధం చేశారు. ఐఏఎంసీ కేంద్రాన్ని నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీజేఐ ఎన్వీ రమణకు అప్పగించనున్నారు. అనంతరం వెబ్ సైట్​ను కేసీఆర్ ప్రారంభిస్తారు. శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో భూమి కేటాయించనున్నట్టు ఈనెల నాలుగోతేదీన‌ జరిగిన ఐఏఎంసీ పరిచయ కార్యక్రమంలో సీఎం వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి