News

చైనా నిఘా, బయోటిక్ సంస్థలపై అమెరికా నిషేధం

657views

న్యూఢిల్లీ: చైనాకు చెందిన బయోటెక్, నిఘా సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. జిన్​జియాంగ్ రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని అందుకే తాము ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపింది. చైనా మిలిటరీకి సాయం అందించే చైనా అకాడమీ ఆఫ్ మిలిటరీ సైన్సెస్​​, దాని 11 పరిశోధన సంస్థలు లక్ష్యంగా అమెరికా వాణిజ్య విభాగం ఈ ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది.

ఉయ్​ఘర్లను అణచివేసేందుకు జిన్​జియాంగ్ రాష్ట్రంలో చైనా ప్రత్యేక నిఘా పెట్టిందని, బయోమెట్రిక్ ఫేస్​ రికగ్నిషన్​ ఉపయోగించి 12 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్కుల డీఎన్​ఏ సేకరిస్తున్నట్టు తమ నిఘా వర్గాల దృష్టికి వచ్చిందని అమెరికా అధికారిక వర్గాలు తెలిపాయి. అందుకే ఈ ఆంక్షలు విధిస్తున్నట్టు వివరించాయి. జిన్​జియాంగ్​లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు నిరసనగా బీజింగ్​లో జరిగే వింటర్ ఒలింపిక్స్​ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్టు అమెరికా గతవారమే ప్రకటించింది. అయితే తమ ఆటగాళ్లు మాత్రం యథావిధిగా పాల్గొంటారని చెప్పింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి