
502views
కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆర్జిత సేవలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. వీఐపీ బ్రేక్ దర్శనం, అభిషేకం టికెట్లకు కూడా ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. ఆర్జిత సేవా టికెట్లు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఆధార్ కార్డు నిబంధనను తీసుకొచ్చినట్లు ఈవో తెలిపారు.





