
512views
ఢిల్లీ: ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు కలకలం సృష్టించింది. ల్యాప్‌టాప్ పేలుడు జరిగినట్టు ప్రాథమికంగా చెబుతున్నా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి కాలికి గాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. కోర్టులో నంబర్ 102లో ఈ పేలుడు ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఘటనాస్థలిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు. దిల్లీ ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేపట్టింది. కాగా, గతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. దిల్లీ రోహిణీ కోర్టు ప్రాంగణంలో గతంలో కాల్పులు జరగ్గా ఓ గ్యాంగ్స్టర్ సహా మొత్తం ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.





