
397views
న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోవడంపై అమెరికా, రష్యా, చైనా, పాకిస్థాన్ సహా వివిధ దేశాలు విచారం వ్యక్తం చేశాయి. భారత రక్షణ రంగంలో రావత్ చేసిన సేవలను స్మరించుకున్నాయి. ఆయన కుటుంబాలను, ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇతర అధికారుల కుటుంబాలకు సంతాపం తెలిపాయి. రావత్ మృతి పట్ల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.





