News

అంతరిక్ష రంగంలో భారత్, రష్యా పరస్పర సహకారం

365views
  • ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం

న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో మరింత సహకరించుకోవాలని భారత్‌, రష్యాలు నిర్ణయించాయి. ఈ మేరకు అంతరిక్ష వాహక నౌకల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన అంగీకార పత్రాలపై సంతకాలు చేశాయి. దీనిపై ఇరుదేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. రష్యన్‌ స్టేట్‌ స్పేస్‌ కార్పొరేషన్‌ (రోస్కోస్మోస్‌), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మధ్య సహకారం పెంపొందించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి.

శాంతియుత ప్రయోజనాల నిమిత్తం బాహ్య ప్రపంచాన్ని వినియోగించుకోవాలని, పరస్పర ప్రయోజనాల నిమిత్తం లాంచ్‌ వెహికల్స్‌ అభివృద్ధిలో సహకరించుకోవాలని అంగీకరించాం. మానవసహిత అంతరిక్షయానం విషయంలో ఉమ్మడి కార్యక్రమాల్లో జరుగుతున్న పురోగతిని ఉభయ పక్షాలు ఆహ్వానించాయి. గగనయాన్‌ కార్యక్రమంలో భాగంగా నలుగురు భారత అంతరిక్ష యాత్రికులు రష్యాలో శిక్షణ పొందారు. ఇది మున్ముందూ కొనసాగుతుంది. కుడంకుళంలో అణు విద్యుత్‌ కర్మాగారంలో పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయి” అని రష్యా పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి