News

సిరియా నౌకాశ్రయంపై ఇజ్రాయిల్ క్షిపణి దాడి

608views

డమాస్కస్​: సిరియాలోని లటాకియా నౌకాశ్రయంపై ఇజ్రాయెల్​ క్షిపణులు దాడి చేసినట్టు సిరియా తెలిపింది. అయితే, ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. పోర్ట్​లోని కంటైనర్ ప్రాంతంలో అనేక క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించిందని సిరియాకు చెందిన ఓ మిలిటరీ అధికారి.. స్థానిక మీడియాకు వివరించారు. గతకొన్నేళ్లుగా సిరియా, ఇజ్రాయెల్ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పటికే వందలసార్లు ఇజ్రాయెల్​ క్షిపణులు.. సిరియాపై దాడులు చేశాయి. సిరియా రాజధాని డమాస్కస్​లోని అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగానూ గతంలో దాడులు జరిగాయి. అయితే, సిరియాలో ఉన్న ఇరాన్​ ఫైటర్స్​పైనే తాము దాడులు జరిపామని ఇజ్రాయెల్ వెల్లడిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి