
451views
గుంటూరు: గుంటూరు గోరంట్లలోని సాయిబాబా, రామాలయం, ఆంజనేయ స్వామి మందిరాల తాళాలు పగలగొట్టి, హుండీలోని నగదు దొంగలు అపహరించారు. తెల్లవారుజామున పూజలు చేసేందుకు వచ్చిన అర్చకులు.. తాళాలు పగలగొట్టి ఉండటంతో ఆలయ నిర్వాహకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.





