
363views
-
చర్చకు వచ్చిన చైనా చొరబాట్ల అంశం
న్యూఢిల్లీ: రష్యా మంత్రులతో జరిగిన సమావేశంలో దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా చొరబాటు అంశాన్ని లేవనెత్తారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని సుష్మాస్వరాజ్ భవన్‌లో ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై కూలంకషంగా చర్చించారు.
మొత్తం అయిదు ఎస్ 400 క్షిపణుల సకాలంలో సరఫరా, తదుపరి రష్యా ద్వారా సమర్థవంతమైన సహాయాన్ని అందించడం వంటివి ఉన్నాయి. దీంతో పాటు ఏకే 203 డీల్‌ను ఖరారు చేసేందుకు కూడా చర్చలు జరిగాయి. భేటీ అనంతరం రాజ్‌నాథ్‌సింగ్, సెర్గీ షోయిగులు భారత్, రష్యాల మధ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు.
Source: Tv9





