News

ఇద్దరు తీవ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్న భారత సైన్యం

398views

జ‌మ్మూ: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు కీలక విజయాన్ని సాధించాయి. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి చేసిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్నారు. షోపియాన్ జిల్లా దుంబవన్ గ్రామంలోని ఓ పాఠశాలలో ఉగ్రవాదులు తలదాచుకున్న విషయాన్ని తెలుసుకుని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.

ఆ తర్వాత భారత సైన్యం వారిని అదుపులోకి తీసుకుంది. రాంబీ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. దీంతో వారు తప్పించుకోవడానికి ప్రయత్నించగా సైనికులు వారిని అరెస్టు చేశారు.

వారిని షాహిద్‌ అహ్మద్‌, అతని అనుచరుడు కిఫాయత్‌ అయూబ్‌ అలీగా గుర్తించారు. వారినుంచి చైనీస్‌ పిస్తోల్‌ సహా ఆయుధ సామ‌గ్రి, పిస్తోల్‌ మ్యాగజైన్‌, రెండు చైనీస్‌ హాండ్‌ గ్రనైడ్లు, ఎనిమిది రౌండ్ల బుల్లెట్లు, రూ.2.9 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి