
619views
-
కొవిడ్ మూడో దశ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సినేషన్ పంపిణీని కేంద్రం విస్తృతం చేసింది. తాజాగా ఒక్కరోజే కోటి డోసుల పంపిణీని పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ వెల్లడించారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి భారత్ కొత్త రికార్డులను నెలకొల్పుతోందని తెలిపారు. శనివారం ఒక్కరోజే 1,00,00,016 మందికి టీకా పంపిణీ కాగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకాల సంఖ్య 127.5 కోట్లు దాటింది. రోజుకు సగటున 59.32 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు పెద్దల్లో 84.8 శాతం మంది తొలి డోసు తీసుకోగా.. 50 శాతం మంది రెండో డోసు తీసుకున్నట్టు తెలిపారు.





