News

పట్టుదల వుంటే వైకల్యం అవరోధం కాదు – నంద్యాల సక్షం సేవా కేంద్రం ప్రారంభంలో వక్తల ఉద్బోధ.

591views

6/1/2019 ఆదివారం సక్షం అధ్వర్యంలో నంద్యాల శ్రీనివాస నగర్లో గల స్వామి వివేకానంద సేవా సమితిలో సక్షం దివ్యాంగుల సేవా కేంద్రం ప్రారంభమైనది.

ఈ కార్యక్రమానికి  చెన్నై నుంచి అమ్మ భగవాన్ లేమాస్ ఆశ్రమం నుంచి వచ్చిన శ్రీ అమ్మ భగవాన్ ముఖ్య శిష్యురాలు దీక్షిత భగవత్ దాస మాట్లాడుతూ నంద్యాలలో సేవా కేంద్రం ప్రారంభం కావడం శుభ పరిణామమని, సేవా కేంద్రానికి అమ్మ భగవాన్ నంద్యాల శాఖ వారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వాగ్దానం చేశారు.

నంద్యాల నగరానికి చెందిన శిల్పా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నెట్ల మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి లభించే వివిధ పధకాల సమాచారం ప్రతి ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సేవా కేంద్రం ద్వారా తెలుసుకోవచ్చని, అవసరమైన వారు ఈ సేవలను వినియోగించుకోవచ్చన్నారు.

నంద్యాల జిల్లా ధర్మ జాగరణ ప్రాముఖ్ శ్రీ రాం ప్రసాద్ మాట్లాడుతూ దివ్యాంగులు సైతం ఉత్సాహంతో ఎన్నో విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. ఈ మధ్య కాలంలో జెనో జిపిని అనే అంథ మహిళా IFS [ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ] కు ఎంపికయ్యారని, అలాగే భారత్ కు చెందిన దివ్యాంగురాలు రెండు కాళ్ళు లేకపోయినా కృత్రిమ కాళ్ళ సాయంతో అంటార్కిటికాలోని వీనేషన్ అనే ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించిందని తెలిపారు. పట్టుదల ఉన్నవారికి వైకల్యం అవరోధం కాదని, పట్టుదల వుంటే ఏదయినా సాధించగలమని రాంప్రసాద్ వివరించారు.